కామధేను జాతీయ పురస్కారం అందుకున్న శంఖారావ యు‘గళం’ | - | Sakshi
Sakshi News home page

కామధేను జాతీయ పురస్కారం అందుకున్న శంఖారావ యు‘గళం’

Published Tue, Dec 10 2024 4:43 AM | Last Updated on Tue, Dec 10 2024 4:43 AM

కామధేను జాతీయ పురస్కారం  అందుకున్న శంఖారావ యు‘గళం’

కామధేను జాతీయ పురస్కారం అందుకున్న శంఖారావ యు‘గళం’

రాజమహేంద్రవరం రూరల్‌/పి.గన్నవరం: నిర్విరామంగా 20 నిమిషాల పాటు శంఖారావాన్ని పూరించడంలో జాతీయస్థాయిలో ఖ్యాతిని ఆర్జించి అనేక రికార్డులను, అవార్డులను, సువర్ణ ఘంటా కంకణాలు సాధించిన శంఖారావ యు‘గళం’ డాక్టర్‌ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు మరో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ దంపతులకు విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ కామధేను జాతీయ పురస్కారాన్ని ఆదివారం హైదరాబాద్‌ టూరిజం ఫ్లాజాలో జరిగిన ఓ కార్యక్రమంలో అందజేసింది. ఆ సంస్థ సీఈఓ సత్యవోలు రాంబాబు ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నందా చేతుల మీదుగా ఆ దంపతులు పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డుల ప్రదానోత్సవాన్ని వీరి శంఖారావంతో ప్రారంభించారు. పి.గన్నవరానికి చెందిన డాక్టర్‌ నరసింహరావు ఏపీ ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్‌) కమాండెంట్‌గా రాజమహేంద్రవరంలో విధులను నిర్వర్తిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement