అయినవిల్లికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఉదయం ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస రుద్రాభిషేకాలు, వివిధ ప్రత్యేక పూజలు చేశారు. మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాల్లో 28 మంది, లక్ష్మీగణపతి హోమంలో 12 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. ముగ్గురు చిన్నారులకు నామకరణ, అక్షరాభ్యాసాలు, తులాభారం వంటివి నిర్వహించారు. 23 మంది నూతన వాహన పూజ చేయించుకున్నారు. స్వామివారి అన్నదాన పథకంలో 1,600 మంది అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.2,82,085 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన బళ్ల దేవీభవాని, పవన్‌కుమార్ దంపతులు రూ, 1,63,810, ఈదరపల్లికి చెందిన దొడ్డ సాయిరామ్, హిమా మాలిని రూ.10 వేలు, కాకినాడకు చెందిన బీఎస్ సూర్యకళ రూ.10,116 అందజేశారు. ఈ సొమ్మును ఆలయ అర్చకులు వినాయకరావు, సత్తిబాబుకు అందజేశారు. దాతలను వేదమంత్రాలతో సత్కరించి స్వామి చిత్రపటం, ప్రసాదం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment