ఇసుకను దోచేస్తున్న కూటమి నేతలు
ఆలమూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం దుర్వినియోగం అవుతుందని, పేదలకు దక్కాల్సిన ఇసుకను కూటమి నేతలు దోచుకుపోతున్నారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు ఇంత అవినీతికి పాల్పడుతున్నా పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు మొద్దు నిద్ర నటిస్తున్నారంటూ విమర్శించారు. జొన్నాడ ఇసుక ర్యాంపులో రోజు రోజుకూ పెరిగిపోతున్న ఇసుక అక్రమాలపై వివిధ దినపత్రికలు, ప్రచార మాధ్యమాల్లో వరుస కథనాలు వెలువడటంపై మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్పందించారు. ఈ మేరకు జొన్నాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సోదరులైన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్‌చార్జి బండారు శ్రీనివాసుకు మధ్య గతంలో జరిగిన కుటుంబ ఆస్తుల మాదిరిగానే నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులను పంచేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక విధానంలో బాట, లోడింగ్ చార్జీలు ట్రాక్టర్ ఇసుకకు రూ.300 వసూలు చేయాల్సి ఉండగా, కూటమి నేతలు రూ.600 వసూలు చేస్తున్నారన్నారు. ఇసుక ర్యాంపుల నుంచి కూటమి నేతల ద్వారా ప్రతి నెలా మామూళ్ల కింద సుమారు రూ.రెండు కోట్ల వరకూ ఎమ్మెల్యే బండారుకు అందుతున్నాయని ఆరోపించారు. అలాగే కూటమి నేతలు ట్రాక్టర్లతో ఇసుకను తరలించి రాత్రి వేళల్లో లారీల్లో నింపి బయటకు తరలించి రూ.లక్షల్లో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నామమాత్రపు ధరతో ఎటువంటి అవినీతికి తావులేకుండా పేదలకు పుష్కలంగా ఇసుకను సరఫరా చేసిన విధానాన్ని ఆయన గుర్తు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం, రైతు భరోసా, మహిళల ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు కూటమి ప్రభుత్వంలో అమలుకు నోచుకోలేదని ధ్వజమెత్తారు. కరెంట్ బిల్లులు, యూజర్ చార్జీలు పెంచి సామాన్యుల నడ్డివిరిచారన్నారు. వచ్చే నెల ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని అన్నారు.
ఇసుక గుట్టలు సీజ్ చేయాలి
కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక గుట్టలను సత్వరమే సీజ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. మైన్స్ అధికారులు మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారే తప్ప ఇసుక దొంగలను గుర్తించడం లేదని అన్నారు. ఇసుక గుట్టలను సీజ్ చేసి అక్రమ తవ్వకాలను నియంత్రించకుంటే అధికారులను దోషులుగా నిర్ధారించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత ఏడాది జొన్నాడలో వర్షాకాలంలో నిర్మాణ అవసరాల కోసం నిల్వ ఉన్న ఇసుక గుట్టల వద్ద అప్పుడే కోనసీమ పర్యటనకు వచ్చిన చంద్రబాబు సెల్ఫీ తీసుకుని నానా హంగామా సృష్టించారన్న విషయం నియోజకవర్గ ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. మండలంలో ప్రస్తుతం ఎక్కడికక్కడ కనపడుతున్న ఇసుక గుట్టల వద్దకు సీఎం చంద్రబాబు మళ్లీ వచ్చి సెల్ఫీ తీసుకోవాలని సలహా ఇచ్చారు. స్థానిక ఏటిగట్టు పక్కన నిల్వ ఉంచిన ఇసుక గుట్టల పైనుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సెల్ఫీ దిగి సీఎం చంద్రబాబుకు దమ్ముంటే ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని చాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో ఔడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీలు తోరాటి లక్ష్మణరావు, మార్గని గంగాధరరావు, జెడ్పీటీసీ సభ్యులు తోరాటి సీతామహాలక్ష్మి, కుడుపూడి శ్రీనివాసు, సర్పంచ్ కట్టా శ్రీనివాసు, ఉప సర్పంచ్ నాండ్ర నాగమోహన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, ముసునూరి వెంకటేశ్వరరావు, నామాల శ్రీనివాసు, చల్లా వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఫ ర్యాంపులను పంచేసుకున్న
బండారు సోదరులు
ఫ ప్రతి నెలా రూ.రెండు కోట్లపైనే మామూళ్లు
ఫ ప్రభుత్వ వైఫల్యాలపై
మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment