సమస్యల పరిష్కారంలో మీనమేషాలు
అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలోని 11 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అమలాపురంలోని అంబేడ్కర్ భవన్‌లో ఎస్టీయూ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు పోతంశెట్టి దొరబాబు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథి సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, 12వ పీఆర్‌సీ నియమించి పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ిసీపీఎస్, జీపీఎస్‌లను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న రూ.25 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సరిదే సత్య పళ్లంరాజు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, ఎస్టీయూ ఆర్థిక కార్యదర్శి నేరేడిమిల్లి సత్యనారాయణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నాగిరెడ్డి శివప్రసాద్, ఉపాధ్యక్షుడు చొప్పల రాంబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు పాల్గొన్నారు.
అమలాపురంలో సినీ హీరో శ్రీకాంత్
అమలాపురం టౌన్: స్థానిక మైపాల వీధిలోని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు ఇంటికి సినీ హీరో శ్రీకాంత్ ఆదివారం వచ్చారు. కృష్ణ పద్మరాజు బావ మరిది యాళ్ల సీతారామ కృష్ణమూర్తి హైదరాబాద్‌లో వ్యాపార రీత్యా స్థిరపడ్డారు. అక్కడ హీరో శ్రీకాంత్, సీతారామ కృష్ణమూర్తి స్నేహితులు. అమలాపురానికి చెందిన సీతారామ కృష్ణమూర్తి తల్లి భానుమతి ఇటీవల మృతి చెందారు. మాతృ వియోగంతో బాధపడుతున్న ఆయన్ని పరామర్శించేందుకు హీరో శ్రీకాంత్ అమలాపురం వచ్చారు.
నేడు యథావిధిగా గ్రీవెన్స్
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) సోమవారం ఉదయం 10 గంట ల నుంచి జరగనుంది. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివా రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీ సుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయితోపాటు డివిజన్, మండల స్థాయిలోనూ గ్రీవెన్స్ జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment