జననేత జగన్‌కు జేజేలు
● జిల్లా కేంద్రం అమలాపురం నియోజకవర్గంలో మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. అమలాపురం బాలుర ఉన్నత పాఠశాల ఎదుట దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. విశ్వరూప్‌తో పాటు ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ రావు, బొమ్మి ఇజ్రాయిల్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులలో పాలు, పండ్లు అందజేశారు. పార్టీ కార్యకర్తలు సుమారు 40 మంది రక్తదానం చేశారు. అల్లవరం మండలం హైస్కూల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు.
● ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు
● జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
● ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతల
సందడి
● పాల్గొన్న ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జిలు
● పలుచోట్ల విరివిగా సేవా కార్యక్రమాలు
సాక్షి, అమలాపురం: జననేత.. సంక్షేమ సారథి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీలతో పాటు 22 మండలాల్లో పుట్టిన రోజు వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. కార్యకర్తలు కేక్ కట్ చేసి పంచుకుని, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. యువ కార్యకర్తలు రక్తదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీలో రాష్ట్ర, జిల్లా, మున్సిపల్, మండల స్థాయి నాయకులు పుట్టిన రోజు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
● కొత్తపేట నియోజకవర్గం పరిధిలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కొత్తపేట సెంటర్‌లో దివంగత వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, స్థానికంగా ఉన్న పేదలకు పాలు, పండ్లు, రొట్టెలు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఆత్రేయపురం అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నవరత్న పథకాల లబ్ధిదారులను సత్కరించారు. ఆయా పథకాల పేరుతో తయారు చేయించిన కేకులను లబ్ధిదారులతోనే కట్ చేయించి పంచారు. స్థానిక పీహెచ్‌సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రావులపాలెం, ఆలమూరులలో జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి.
● ముమ్మిడివరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జగన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అభిమానులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. తరువాత పార్టీ కార్యాలయాలలో భారీ కేకులు కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంచారు.
● పి.గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురులో జరిగిన కార్యక్రమంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో పార్టీ మండల శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యకర్తలు రోగులకు బ్రెడ్లు, పాలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవితో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
● రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో పార్టీ ఇన్‌చార్జి పిల్లి సూర్య ప్రకాష్, ఆధ్వర్యంలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి.
● రాజోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రాజోలు మండలం పొన్నమండ, తాటిపాక, సోంపల్లి, పొన్నమండ, మలికిపురం మండలంలో గుబ్బలపాలెం, మలికిపురం, సఖినేటిపల్లి సంజీవయ్య కాలనీల్లో జగన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. మలికిపురంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో తోట త్రిమూర్తులు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. రాజరత్న సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment