ఉత్సాహంగా వ్యాససరచన, వక్తృత్వ పోటీలు
ముమ్మిడివరం: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లాలో 22 మండలాల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు శనివారం శ్రీవినియోగదారు న్యాయ పాలనకు వర్చువల్ విచారణలు, డిజిటల్ సౌలభ్యంశ్రీ (థీమ్స్) అనే అంశంపై పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలలో 36 మంది పాల్గొనగా ఎం.తనూష్, డి.శ్రీవిద్య, ఏడిద నవ్యలక్ష్మి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. వక్తృత్వ పోటీలలో 26 మంది విద్యార్ధులు పాల్గొనగా ఆర్‌ఎన్‌ఎస్‌బీ పవన్, ఎన్ మనస్విని లక్ష్మి, ఎం.సాయి అశ్విత మొదటి మూడు స్థానాలు సాధించారు. విజేతతలు ఈనెల 23న విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నారు. ఈ పోటీలు జిల్లా సమగ్ర శిక్ష సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో జరగగా జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి బి.హనుమంతరావు, బి.రమణశ్రీ, ఆర్.ఉదయ భాస్కరరావు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను డీఈఓ షేక్ సలీంబాషా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment