దేశ ప్రతిష్టను దిగజార్చారు
అమిత్ షా వ్యాఖ్యలపై మాజీ మంత్రి గొల్లపల్లి
మలికిపురం: భారత రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దిగజార్చాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. శనివారం ఆయన మలికిపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా సాధించిన అత్యున్నత పదవి అనుభవిస్తూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను తక్కువ చేసి మాట్లాడడం అంటే భారత జాతిని హేళన చేయడమేనని ధ్వజమెత్తారు. తక్షణమే అమిత్ షాపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు కూనపరెడ్డి రాంబాబు, కుసుమ చంద్రశేఖర్, కట్టా శ్రీనివాస్‌రావు, తాడి సహదేవ్, కొల్లాబత్తుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
అమలాపురం రూరల్: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు, మండల స్థాయిలో ప్రజా ఫిర్యాదులను క్రమ పద్ధతిలో పరిష్కరించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలకు నూరు శాతం నాణ్యమైన పరిష్కారాలు అందించాలని సూచించారు. డివిజన్ మండల స్థాయి అధికారులు ప్రతి సోమవారం ఈ వేదికకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. డివిజన్, మండల స్థాయిల్లో అర్జీల స్వీకరణకు అధికారులు ఉదయం 9 గంటల లోపు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు విశేష ప్రచారం కల్పించాలని ఆదేశించారు.
ఎన్నికలు దామాషా పద్ధతిలో నిర్వహించాలి
ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్
అమలాపురం టౌన్: జమిలి పద్ధతిలో ఎన్నికలు ఫెడరల్ విధానానికి అవరోధమని ఆర్‌పీఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీబీ లోక్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశ సమగ్రతకు దామాషా పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణంలోని అరిగెలపాలెంలో ఆయన అధ్యక్షతన ఆర్‌పీఐ న్యాయవాదులు, అంబేడ్కర్ అభిమాన న్యాయవాదులతో శనివారం జరిగిన సమావేశం దామాషా పద్ధతిలోనే ఎన్నికల జరగాలన్న వాదనను వినిపించింది. జమిలి ఎన్నకలంటే రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛను హరించడమేనని లోక్ అన్నారు. రాజ్యాంగ మౌలిక విధానానికి ఆటంకమని పేర్కొన్నారు. స్ట్రాంగ్ కేంద్రం– స్ట్రాంగ్ రాష్ట్రం అనే విధానానికి జమిలి ఎన్నికలు విరుద్ధమన్నారు. ఒకే ఓటు– ఒకే విలువ అనే రాజ్యాంగ సూత్రాన్ని ఎన్నికల్లో పాటించి పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో న్యాయవాదులు పెయ్యల శ్రీనివాసరావు, కటికదల సత్యనారాయణ, డి.చిరంజీవి తదితరలు పాల్గొన్నారు.
జీపీటీలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ (జీపీటీ) కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి కొండలరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సుకు ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు వారు అర్హులన్నారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, డొమెస్టిక్ నాన్ వాయిస్ కోర్సుకు పదో తరగతి ఆపైన ఉత్తీర్ణులై, 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తామని, వివరాలకు 90107 37998 నంబరులో సంప్రదించాలని కోరారు.
21ఎఎంపీ16
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌పీఐ
రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్
Comments
Please login to add a commentAdd a comment