పట్టుదలతో లక్ష్య సాధన
సాక్షి, అమలాపురం: విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని పట్టుదలతో సాకారం చేసుకోవాలని జాగ్వర్ ల్యాండ్ రోవర్ సంస్థ సీఈవో లలిత ఇంద్రకంటి తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో విద్యార్థినులతో ఆమె ముఖాముఖి మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన విజయాలను వారికి వివరించారు. తాను ఒక పేద కుటుంబం నుంచే ఈ స్థాయికి వచ్చానని, చదువే తనను ఈ స్థాయిలో నిలిపిందని తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలో అధిక మార్కులు వచ్చిన విద్యార్థినులకు ఆమె బహుమతులు అందించారు. పట్టణంలో ఒక పెళ్లికి హాజరైన ఆమె తన పూర్వ స్నేహితురాలైన బండి రాధమ్మను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాసరావు, అడబాల శ్రీనివాస్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment