భజే గణనాయకా..
అయినవిల్లి: భజే గణనాయకా అంటూ ఆ స్వామివారిని భక్తజనం కొలిచింది.. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి మేలు కొలుపుసేవ, ఏకాదశ, లఘున్యాస, రుద్రాభిషేకాలు, వివిధ ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో అర్చకస్వాములు సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాల్లో 39 మంది, లక్ష్మీగణపతి హోమంలో 17 మంది, పంచామృతాభిషేకాల్లో ఇరువురు దంపతులు పాల్గొన్నారు. నలుగురు చిన్నారులకు నామకరణ, అక్షరాభ్యాసం, తులాభారం, 25 మంది నూతన వాహన పూజలు జరిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో 2,140 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయానికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.2,02,54 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
నేడు యథావిధిగా గ్రీవెన్స్
అమలాపురం రూరల్: జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా జరగనుంది. దీనిని అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయితోపాటు డివిజన్, మండల స్థాయిలో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment