ఎన్నికల హామీని అమలు చేయాలి
కపిలేశ్వరపురం: తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి, విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం కేదారిలంకలో వలంటీర్లు పంచాయతీ కార్యాలయ ఉద్యోగికి వినతిపత్రాన్ని అందజేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసే క్రమంలో వలంటీర్ల అవసరం ఎప్పుడూ ఉంటుందన్నారు. ప్రభుత్వాలు మారినా పేదల ప్రయోజనార్థం వలంటీర్లను విధుల్లో కొనసాగించాలని కోరారు. విధుల్లో తీసుకుంటామని, రూ.10 వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతామంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు వెన్నేటి శివకుమార్, కాశీ రమేష్, మట్టపర్తి రామకృష్ణ, మద్దింశెట్టి ధనరాజు, ఓలేటి చందు, యమన నాగవేణి, వీధి పరిమళ, తిరుపతి భాగ్యపావని, యర్రంశెట్టి నాగలక్ష్మి, గోశాల లక్ష్మి, నామాడి నవీన్ పాల్గొన్నారు.
ఆధికారంలోకి రాగానే మమ్ముల్ని పక్కన పెట్టేశారు
అయినవిల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు నెలకు రూ. పదివేల జీతం ఇస్తామని తీరా అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పక్కకు పెట్టారని వీరవల్లిపాలెంలోని గ్రామంలో వలంటీర్ల గురువారం నిరసన తెలిపారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. తమ గోడు ప్రస్తుత సీఎం చంద్రబాబు పట్టించుకోవాలని కోరారు. ఏడు నెలలుగా తమకు జీత భత్యాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యదర్శి బులి వీరన్నకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వాలంటీర్ల సంఘ జిల్లా కన్వీనర్ సతీష్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వానికి వలంటీర్ల వినతి
Comments
Please login to add a commentAdd a comment