సృజనతో ఉజ్వల భవిత
పి.గన్నవరం: సృజనాత్మకత పెంపొందేలా విద్యార్థుల ఆలోచనా విధానం ఉండాలని వాటి నుంచే నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని అధికారులు, ప్రజా ప్రతినిధులు పిలుపునిచ్చారు. మండలంలోని పి.గన్నవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవీ), కుడుపూడి సూర్యనారాయణ రావు, అమలాపురం డీఆర్వో జె.మాధవి, కొత్తపేట ఆర్డీవో పి.శ్రీకర్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ తదితరులతో కలసి ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకుంటే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందన్నారు. బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికి, విశ్లేషనాత్మకంగా, ప్రయోగాత్మకంగా విద్యను అభ్యసించినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ సృజనకు పదునుపెట్టేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలన్నారు. విద్యార్థుల సృజనను గుర్తించి గుర్తించి ఏ రంగంలో వారు నిష్ణాతులు కాగలరో ఆ వైపు అడుగులు వేయించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అలాగే పిల్లల జిజ్ఞాసకు పదను పెట్టేలా తల్లిదండ్రులు తోడ్పడాలని అన్నారు. జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 22 మండలాల నుంచి జిల్లా సైన్స్ ఫేర్‌కు 110 ప్రాజెక్టులు వచ్చాయన్నారు. ఈ నెల రెండో వారంలో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయిలో ఎంపికై న ప్రదర్శనలు పాల్గొంటాయన్నారు. వీటి నుంచి విద్యార్థి వ్యక్తిగత విభాగం, గ్రూపు విభాగం, ఉపాధ్యాయ విభాగం నుంచి రెండేసి చొప్పున మొత్తం ఆరు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్టు తెలిపారు. అంతకు ముందు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లోగో ఆవిష్కరించిన అనంతరం జాతీయ, జిల్లా సైన్స్ కాంగ్రెస్, పాఠశాల పతాకాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డీఆర్వోలు ఆవిష్కరించారు. బ్రెయిలీ లిపి దినోత్సవాన్ని పురస్కరించకుని లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి నివాళులర్పించారు. సమావేశంలో పాఠశాల హెచ్‌ఎం డీవీఎస్ ప్రసాద్, సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు బీవీవీ సుబ్రహ్మణ్యం, డి.రమేష్‌బాబు, పి.రాంబాబు, డాక్టర్ ఎంఏకే భీమారావు, ఎంవీవీ సత్యనారాయణ, ఎంపీడీవో కేవీ ప్రసాద్, తహసీల్దారు పి.శ్రీపల్లవి, ఎంఈవోలు కోన హెలీనా, చింతా వీరభద్రానందం, ఎస్‌ఎంసీ ఛైర్మన్ నల్లా దుర్గారావు, జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు, ఎంపీటీసీలు పులపర్తి వెంకటలక్ష్మి, స్థానిక నేతలు డొక్కా నాథ్‌బాబు, శిరిగినీడి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు
పిల్లలను ప్రోత్సహించాలి
ప్రజాప్రతినిధులు, అధికారుల పిలుపు
ఆకట్టుకున్న జిల్లా విద్యా
వైజ్ఞానిక ప్రదర్శనలు
రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజక్టులు ఇవే..
వ్యక్తిగత విభాగంలో
స్టూడెంట్ పేరు ఎగ్జిబిట్ పేరు స్కూల్ పేరు
కె.సల్వినా మేజికల్ అంబ్రెల్లా గురుకులం, గోడి
ఎన్.నిఖిల్ విజయ్‌కుమార్‌రెడ్డి రైన్ డిఫెక్టర్ టు జెడ్పీహెచ్, ఊబలంక
ప్రొటెక్ట్ క్లాత్స్
కె.సంజయ్‌కుమార్ వెహికల్ ఏక్సిడెంట్ జెడ్పీహెచ్‌ఎస్, ఐ.పోలవరం
ప్రివెన్షన్
గ్రూపు విభాగంలో
పి.రోహిణి, శశివర్దన్ మల్టీపర్పస్ సైక్లింగ్ మిల్ జెడ్పీహెచ్‌ఎస్,
వన్నెచింతలపూడి
ఎ.దుర్గాసాయి, ఎ.నోకిధర్ బ్యాంక్ సెక్యూరిటీ జెడ్పీహెచ్‌ఎస్, ఊబలంక
సిస్టమ్ యూజింగ్ జీఎస్‌ఎం
ఎస్.జస్వంత్‌కృష్ణ స్మార్ట్ అగ్రికల్చర్ జెడ్పీహెచ్‌ఎస్,
సీహెచ్.వి.కార్తీక్ కొండుకుదురు
ఉపాధ్యాయ విభాగంలో
ఎంఎల్ శ్రీనివాసరావు నంబర్ సిస్టమ్ జెడ్పీహెచ్‌ఎస్,
కొండుకుదురు
కేసీహెచ్‌ఎన్‌జీ పేపర్ పల్ప్ మేకింగ్ మెషీన్ జెడ్పీహెచ్‌ఎస్, తొండవరం
నరసింహారావు
ఎ.రామకృష్ణ లోకాస్ట్, నోకాస్ట్ టీఎల్‌ఎం జెడ్పీహెచ్‌ఎస్, గొల్లవిల్లి
Comments
Please login to add a commentAdd a comment