గిత్తందం.. గోచందం
● రెండో రోజూ ఉత్సాహంగా
గిత్తలు, ఆవుల పోటీలు
● ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
మలికిపురం: మండలంలోని కేశనపల్లి గ్రామంలో గిత్తల అందాలు, ఆవుల పాల పోటీలు శనివారం రెండో రోజూ ఉత్సాహంగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి రైతులతో వచ్చిన గిత్తల అందాలను న్యాయ నిర్ణేతలు వీక్షించారు. అలాగే శనివారం ఉదయం, రాత్రి కూడా ఆవుల పాల ఉత్పాదన పోటీలు నిర్వహించారు. ప్రదర్శనలకు వచ్చిన ఆవులు, గిత్తలకు నిర్వాహకులు మేత సమకూర్చారు. పశు వైద్య నిపుణులను అందుబాటులో ఉంచి ఆవులకు, గిత్తలకు మంచు నుంచి రక్షణగా టెంట్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారం ముగింపు, బహుమతుల ప్రదానం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment