రేపటి నుంచి పింఛన్ల తనిఖీ
అమలాపురం రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య పింఛన్ల తనిఖీని సోమవారం నుంచి 25వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. నెలకు రూ.15 వేలు పింఛన్ పొందుతున్న మంచానికి, విల్ చైర్ కి పరిమితమైన 373 మంది పింఛన్‌దారులు, యాక్సిడెంట్ ప్రభావిత వ్యక్తులకు ఇచ్చే పింఛనుదారులు 120 మంది మొత్తం 493 మంది అర్హతను మూడు వైద్య బృందాలు పరిశీలించనున్నాయి. లబ్ధిదారుని భౌతిక పరిస్థితిని క్షుణ్ణంగా పరీక్షించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేయనున్నారు. బృందాల పర్యటన వివరాలు లబ్ధిదారులకు ముందుగానే సంబంధిత సెక్రెటేరియట్ వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా తెలియజేయనున్నారు. వైద్య బృందం సందర్శన సమయంలో లబ్ధిదారులు తప్పనిసరిగా ఇంటి వద్ద అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. అందుబాటులో లేని లబ్ధిదారుల పింఛనును తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఈ తనిఖీలకు సంబంధించి బృందాలకు శనివారం శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శివ శంకర ప్రసాద్, డీసీహెచ్‌ఎస్ కార్తిక్ రెడ్డి, డీఎంహెచ్‌ఓ దొరబాబు, జీఎస్ డబ్ల్యూఎస్ నోడల్ అధికారి త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
వాడపల్లికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: మండలంలోని వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఏడు శనివారాల వ్రతం చేపట్టి వెంకన్న దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన అన్న సమారాధనలో వేలాది మంది అన్న ప్రసాదం స్వీకరించారు. దేవాదాయ – ధర్మాదాయ శాఖ డీసీ, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం ఒక్కరోజు స్వామి వారికి రూ.29,93,074 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎస్.రాము, వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి ఆలయం ఆవరణలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment