ఆర్‌ఎస్‌కే విధులకు ఏఈఓలు వద్దు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల విధుల నుంచి వ్యవసాయ విస్తరణ అధికారులకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఏఈఓ సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి డి.వేణు మాధవరావు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.రాజశేఖర్ కు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం రాజమహేంద్రవరంలో రాజశేఖర్‌ను కలిసి టీటీడీ డైరీ అందజేసిన అనంతరం ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 150 మంది వరకు వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు సేవా కేంద్రంలో పనిచేస్తున్నారని, రైతు సేవా కేంద్రాల్లో ఎవరు సెలవు పెట్టినా ఏఈఓలను నియమిస్తున్నారని పేర్కొన్నారు. క్లస్టర్ స్థాయిలో ఏఈవోలకు మాత్రమే విధులు అప్పగించాలని కోరారు. అలాగే వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ కోటాను కొనసాగించాలని కోరినట్లు తెలిపారు. ఈ విషయమై ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. రాష్ట్ర సంఘ ప్రచార కార్యదర్శి పీటర్, ఉమ్మడి జిల్లా ఏఈఓ సంఘ కోశాధికారి ఎం.నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వినతి
Comments
Please login to add a commentAdd a comment