సోషల్ మెసేజ్ సినిమా ‘గేమ్ ఛేంజర్’
సాక్షి, రాజమహేంద్రవరం: రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అని, సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని సినీ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాంచరణ్ కథనాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. కియారా అడ్వాణీ కథానాయిక. దిల్ రాజు నిర్మాత, సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా రాజమండ్రి రూరల్ వేమగిరి వద్ద శనివారం మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందన్నారు. సినిమా చిత్రీకరణకు బడ్జెట్ పెరుగుతున్న నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుతున్నామన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే చిరంజీవి చలవేనన్నారు. రామ్‌చరణ్ తమ్ముడు లాంటివాడని, ఎంత ఎదిగినా ఒదిగుండే మనిషన్నారు. భవిష్యత్తులో ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. కాగా ఈ ప్రైవేటు కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ సహా అధికారులు హాజరు కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Comments
Please login to add a commentAdd a comment