సూపర్ సిక్స్ అమలులో ప్రభుత్వం విఫలం
సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారాల్లో కూటమి పార్టీల నాయకులు సూపర్ సిక్స్ పథకాల పేరుతో అనేక హామీలు ఇచ్చి, అమలులో దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆరు నెలల కాలంలో అవినీతి కూడా అలముకుందని ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment