ప్రతి ఇంటా భోగిభాగ్యాలు
సాక్షి, అమలాపురం: సంక్రాంతి పండగొచ్చింది.. సంబరాలను తెచ్చింది. ఎముకలు కొరికే చలిలో పచ్చని ప్రకృతి పరవశించగా.. తెలవారక ముందే.. మంచు దుప్పటి తెరుచుకుంటున్న వేళ భోగి మంటలతో గ్రామాలు, పట్టణాలు ప్రకాశించాయి. సూర్యోదయానికి ముందే జనం జీవితాల్లో వెలుగులు నింపేందుకు మంటలు ఎగిశాయి. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రోడ్ల కూడళ్లలో సోమవారం తెల్లవారు జామున భోగి మంటలు వేశారు. భోగితో సంక్రాంతి పండగ మొదలైంది. ఇళ్ల వద్ద పాలు పొంగించి రైతులు పండగను స్వాగతించారు. సాయంత్రం చిన్న పిల్లలున్న ఇళ్లలో భోగి పళ్ల కార్యక్రమం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు గొబ్బెమ్మలను పెట్టి ఆడి పాడారు.
అదనపు ఎస్పీగా
మనీష్ దేవరాజ్
కాకినాడ క్రైం: జిల్లా అదనపు ఎస్పీగా మనీష్ దేవరాజ్ పాటిల్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. తొలుత గ్రే హౌండ్స్‌లో పని చేసిన అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment