విద్యుత్ బిల్లుల పెంపుపై వినూత్న నిరసన
భోగి మంటల్లో బిల్లులు వేసి దహనం
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం విద్యుత్ బిల్లులను పెంచడంపై సీపీఐ పార్టీ అమలాపురం నియోజకవర్గంలో సోమవారం వినూత్న నిరసన తెలిపింది. భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను వేసి దహనం చేసింది. అమలాపురం మున్సిపల్ కాలనీ, కురసాలవారి వీధి, ఆర్టీసీ బస్టాండ్ వద్ద కరెంట్ బిల్లులను భోగి మంటల్లో వేసి తగలబెట్టి ఆ పార్టీ నేతలు నినాదాలు చేశారు. అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లోని పలు గ్రామాల్లో భోగి మంటల్లో పెరిగిన కరెంట్ బిల్లులు వేసి దహనం చేశామని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు తెలిపారు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులను పెంచేది లేదని చెప్పి, నేడు మాట మార్చారంటూ సత్తిబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే పెంచిన విద్యుత్ చార్జీలతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ నియోజకవర్గ నాయకులు భీమరాజు, శ్రీనివాసరావు, పలు ప్రజా సంఘాల నాయకులు కుడుపూడి సత్యనారాయణ, అయితాబత్తుల సుబ్బారావు, కై రం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment