గాలిపటమా పదపదా..
అంబరాన్నంటిన కై ట్ ఫెస్టివల్
అల్లవరం: తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన పతంగుల పండగ కోనసీమ జిల్లాలో ఓడలరేవు తీరానికి విస్తరించింది. ఎంతో ఆహ్లాద వాతావరణంలో కై ట్ ఫెస్టివల్ అంబరాన్ని తాకింది. ఓడలరేవు తీరంలో తొమ్మిదేళ్ల కిందట స్థానిక యువత ఆధ్వర్యంలో ప్రారంభమైన కై ట్ ఫెస్టివల్ నేడు వేలాది పతంగులతో పట్టపగలే సుందర దృశ్యాన్ని ఆవిష్కరించింది. సంక్రాంతికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు పతంగులను ఎగురవేయడానికి పోటీ పడ్డారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గాలిపటాలు ఎగురవేసి ఆనందంగా గడిపారు. అలాగే సముద్రంలో స్నానాలు ఆచరించి పిల్లా పాపతో సందడి చేశారు. ఓడలరేవు గ్రామానికి చెందిన తాడి ధర్మారావు, పెమ్మాడి రమేష్ ఆధ్వర్యంలో సముద్ర తీరంలో సోమవారం కై ట్ ఫెస్టివల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తీరానికి వచ్చేసిన వేలాది మందికి పతంగులను ఉచితంగా అందించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులకు తాగునీరు, భోజన సౌకర్యాలు కల్పించి కై ట్ ఫెస్టివల్‌కు కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. కమిటీ సభ్యులు పాల వెంకటేశ్వరరావు, కలిగితి ఏసురత్నం, కొల్లు త్రిమూర్తులు, రామకృష్ణ, కొల్లు విష్ణుమూర్తి, నాతి లెనిన్‌బాబు, తారాడి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment