చదువుతో పాటు డ్యాన్స్ కూడా...
నేను పదో తరగతి చదువుతున్నా. ఆరేళ్ల నుంచి కూచిపూడితో పాటు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. మలేషియాలో జరిగిన పోటీల్లో సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి వచ్చింది. నాట్యాచార్యులు ఉమ జయశ్రీ నాట్య సాధన చేస్తున్నా. అలాగే చదువుకూ సమయం కేటాయిస్తున్నా.
– చెరుకుమిల్లి సిరిచందన
నాట్యం అంటే ప్రాణం
నేను ఏడో తరగతి చదువుతున్నాను. నాకు నృత్యం అంటే ప్రాణం. మలేషియాలో జరిగిన పోటీలో ద్వితీయ బహుమతి వచ్చింది. నేను 2024లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతి ప్రముఖ దేవాలయంలో నృత్య నీరాజన కార్యక్రమంలో పాల్గొన్నా. – కె.హర్షిత కావ్య
అనేక బహుమతులు వచ్చాయి
నేను ఐదోతరగతి చదువుతున్నాను. మలేషియా పోటీలో సెమీ క్లాసికల్ జూనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించా. 2023 జూన్‌లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం వారు నిర్వహించిన హనుమాన్ చాలీసాను 14 గంటల 2 నిమిషాల పాటు 101 మంది కళాకారులతో కలసి నృత్యం చేసినందుకు గోల్డెన్ స్టార్, భారత్ వరల్డ్ రికార్డ్, గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందా. – ధర్నాలకోట శరణ్య
Comments
Please login to add a commentAdd a comment