అంబాజీపేట: మోటారు సైకిళ్లు తప్పించే ప్రయత్నంలో రెండు సామాజిక వర్గాల మధ్య సోమవారం సాయంత్రం ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ముక్కామల జెడ్పీ హైస్కూల్ సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందేలు, గుండాల బరికి కూతవేటు దూరంలో ప్రధాన రహదారిపై ఇరువర్గాలకు చెందిన యువకులు మోటారు సైకిళ్లు తప్పించే ప్రయత్నంలో వివాదం జరిగింది. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ విషయమై స్థానికులు అంబాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అక్కడ ఉన్నవారిని చెదరగొట్టారు. అలాగే కోడి పందేలు, గుండాలను నిలుపుదల చేయించారు. క్షతగాత్రులు అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎస్సై కె.చిరంజీవి తెలిపారు. ఇదిలా ఉండగా ఘర్షణ సమయంలో పోలీస్ కానిస్టేబుల్ నియంత్రిస్తుండగా, అతనిపైనా యువకులు కేకలు వేసినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment