కాసులు కురిపించిన కోసలు
అల్లవరం: సంక్రాంతి పండగకు నిర్వహించే కోడి పందేలకు ఎంత క్రేజు ఉంటుందో అదే స్థాయిలో పందెం బరిలో వీర మరణం పొందిన పుంజు (కోస)కు అంతే క్రేజు ఉంటుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోస గురించి తెలియని వారు ఉండరు. పందెంలో పోరాడి చనిపోయిన కోసని వేలాది రుపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. బరువును బట్టి రూ.3 వేల నుంచి రూ. 10 వేలు వరకు కోసల కోసం వెచ్చిస్తారు. ఇష్టమైన వారికి, బంధువులకు, స్నేహితులకు తమ హోదాని వారికి తెలియచెప్పేందుకు రూ.వేలల్లో ఖర్చు చేసి కోసని బహుమతిగా ఇస్తుంటారు. పందెం జరుగుతున్న సమయంలో బరుల వద్ద కోసల కోసం మాంసప్రియులు ఎగబడతారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఆగస్టు నెలల్లో లభించే పులస చేపకు ఎంత ప్రత్యేకత ఉందో ఆదే స్థాయిలో ‘కోస’కి కూడా ఉంది. కోస రుచికి ఎవరైనా ముగ్ధులు కావల్సిందే. అయితే కోడి పుంజులన్నీ కోసలు కాదు. పందెం బరిలో ప్రత్యర్థితో పోరాడుతూ మృతిచెందిన కోడే కోసగా పరిగణిస్తారు. పందెం కోళ్లకు రెండు నెలల ముందు నుంచే బరిలో ఎలా పోరాడాలో తర్ఫీదు ఇస్తారు. వేడి నీళ్లల్లో ఈత కొట్టిస్తారు. వ్యాయమాలు చేయిస్తారు. బాదం, జీడిపప్పు, పిస్తా వంటి ఆహారాన్ని అందిస్తారు. కోడి పందెం జరుగుతున్న సమయాల్లో ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడానికి కోసలకై ఎగబడతారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ యంత్రాంగం మాత్రం పందెం బరుల్లో నిర్వాహకుల నుంచి కోసలను పొందుతుంటారు.
వీరమరణం పొందిన
కోడికి భలే డిమాండ్
రూ.3 వేల నుంచి
రూ.10 వేల వరకు గిరాకీ
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను
ప్రసన్నం చేసుకోవడానికి
కానుకగా కోసలు
Comments
Please login to add a commentAdd a comment