బరిలో.. నవల ఆవిష్కరణ
యానాం: యానాంకు చెందిన ప్రముఖ కవి దాట్ల దేవదానంరాజు రచించిన బరిలో.. నవల పుస్తకాన్ని బుధవారం ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఆవిష్కరించారు. పురాణ, చారిత్రక, సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణంలో కోడిపందేల నేపథ్యంలో రాసిన తొలి తెలుగు నవల బరిలో పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం రచయిత దాట్ల దేవదానంరాజు మాట్లాడుతూ కోడిపందేల ఇతివృత్తం తెలుగు సాహిత్యంలో నమోదు కాలేదని, తాను విషయ సేకరణచేసి రాసిన నవల అని తెలిపారు. మాజీ ఎంపీపీ మందాల గంగసూర్యనారాయణ, చింతా వెంకట్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment