ముచ్చటగా మూడో సారి..
ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో నృత్య
ప్రదర్శనకు అవకాశం
అంబాజీపేట: ఢిల్లీలో ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం వద్ద నృత్య ప్రదర్శనకు ముక్కామల గ్రామానికి చెందిన పసుపులేటి నాగబాబు బృందానికి మూడోసారి అవకాశం లభించింది. ఈ మేరకు నాగబాబు బృందం ఆధ్వర్యంలోని 16 మంది సభ్యులు 12న ఢిల్లీ చేరుకుని ప్రదర్శన రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. 26న ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక బొమ్మలు (ఎకో ఫ్రెండ్లీ) థీమ్‌తో ప్రదర్శించే శకటం ముందు సంప్రదాయ నృత్యాలు చేసేందుకు ఆ 16 మంది నృత్య కళాకారులను ఎంపిక చేశారు. శకటానికి ఇరువైపులా ఏటికొప్పాక ఎకో ఫ్రెండ్లీ బొమ్మలను లాగుతూ సంప్రదాయ నృత్యాలు చేసుకొంటూ కొనసాగుతారని నాగబాబు తెలిపారు. ఇదిలా ఉండగా నాగబాబు బృందం తొలిసారిగా 2023లో గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకాదశ రుద్రుల ప్రభల శకటం ముందు గరగ నృత్యాలను ప్రదర్శించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రదర్శించిన అక్షరాస్యతా శకటంతో పాటు రెండోసారి గరగ నృత్యాలను ప్రదర్శించారు. కాగా ఈ నెల 26న జరగబోయే గణతంత్ర వేడుకల్లో ఏటికొప్పాక సంప్రదాయ బొమ్మల శకటానికి ఇరువైపులా నృత్యాలను ప్రదర్శిస్తామని నాగబాబు వివరించారు. వరుసగా మూడో సారి అవకాశం లభించినందుకు నాగబాబు ఆనందం వ్యక్తం చేస్తూ, ఐఅండ్‌పీఆర్ జేడీ కిరణ్‌కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment