బాలా... భళా
● పిల్లలకు చిత్ర కళా పోటీలు
● వివిధ ప్రాంతాల నుంచి 450 మంది హాజరు
అమలాపురం టౌన్: కోనసీమ చిత్రకళా పరిషత్ ఏటా జాతీయ చిత్రకళా పోటీలు, ప్రదర్శన నిర్వహించే ముందు రోజు బాల బాలికలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అమలాపురం సత్యసాయి కల్యాణ మండపంలో బాలల చిత్రకళా పోటీలు జరిపారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 450 మంది బాల చిత్రకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. పరిషత్ ఆధ్వర్యంలో ఇదే వేదికపై ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జాతీయ చిత్రకళా పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి, చిత్రకారుడు కొరసాల సీతారామస్వామి ఆధ్వర్యంలో ఈ బాలల చిత్రకళా పోటీలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ సాగాయి. బాలల విభాగంలో ఏ అంశంౖపైనెనా చిత్రం గీసే స్వేచ్ఛను పిల్లలకు కల్పించడంతో వారు తమకు నచ్చిన అంశంపై సృజనాత్మకంగా చిత్రాలు గీశారు. పోటీల్లో పాల్గొన్న బాలల నుంచి 33 మందిని ఎంపిక చేసి వారికి బంగారు పతకాలు అందించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కోనసీమ మహిళా మండలి అధ్యక్షురాలు పోలిశెట్టి అనంతలక్ష్మీదేవి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ రంకిరెడ్డి కాశీలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment