కళారే విచిత్రం!
కొబ్బరి బొండాలు, కొబ్బరి చెక్కలు, కొబ్బరి బొండాం నీళ్లు
కృష్ణాష్టమి వేడుకల్లో ఉట్టి కొట్టే ఘట్టం
ఐదుసార్లు అవార్డులు పొందాను
కోనసీమ చిత్ర కళా పరిషత్ ఏటా నిర్వహించే జాతీయ చిత్ర కళా పోటీల్లో పొల్గొంటూనే ఉంటాను. అయితే గత 35 ఏళ్లలో ఇప్పటి వరకూ 5 సార్లు ఈ పరిషత్ ద్వారా నేను గీసిన చిత్రాలకు అవార్డులు వచ్చాయి. కోనసీమ చిత్ర కళా పరిషత్ నాలాంటి చిత్రకారులను ఎందర్నో ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. నేను గీసిన చిత్రం ఈ జాతీయ పోటీల్లో అవార్డు పొందడమే కాకుండా జాతీయ చిత్రకళా ప్రదర్శనలో ఆ చిత్రం ప్రదర్శితం కావడం మరీ ఆనందం కలిగించింది.
– కాదూరి రామకృష్ణ,
చిత్రకారుడు, బొబ్బిలి, విజయనగరం జిల్లా
అమలాపురం టౌన్: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు గీసిన దాదాపు 500 చిత్రాలు ఒకే వేదికపై ప్రదర్శితం కావడంతో అవి చిత్రకళాభిమానులను కనువిందు చేశాయి. అమలాపురంలోని శ్రీసత్యసాయి కల్యాణ మండపం జాతీయ చిత్ర కళా ప్రదర్శనకు ఆదివారం వేదిక కావడంతో ఈ చిత్ర కళా బ్రహ్మోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన 450 చిత్రకారులు తరలివచ్చారు. సత్యసాయి కల్యాణ మండపం ఆద్యంతం రంగుల లోకంగా మారింది. వందల సంఖ్యలో ప్రదర్శితమైన చిత్రాలు కళా ప్రియులను రంజింప చేశాయి. ఆలోచింపచేశాయి. కోనసీమ చిత్ర కళా పరిషత్ ఆధ్వర్యంలో 35వ జాతీయ చిత్ర కళా పోటీలకు సంబంధించిన జాతీయ చిత్ర కళా ప్రదర్శనతో వందల చిత్రాలు కొలువుదీరాయి. పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి, చిత్రకారుడు కొరసాల సీతారామస్వామి పర్యవేక్షణలో ఈ చిత్ర కళా ప్రదర్శన జరిగింది. సీతారామస్వామి స్వీయ సేకరణతో దేశంలోని 215 మంది ప్రముఖ చిత్రకారుల చిత్రాలతో ముద్రితమైన ‘అవర్ ఆర్టిస్ట్స్ బోరన్ టు ఎక్సెల్’ పుస్తకాన్ని చిత్రకారులతో కలసి పరిషత్ కార్యదర్శి సీతారామస్వామి సమీక్షించారు. నేటి ఆధునిక పోకడలకు అనుగుణంగా మారుతున్న చిత్ర కళపై చర్చించారు. దేశంలోని ఇంతమంది చిత్రకారుల ఫొటోలు, వారి వేసే చిత్ర కళ విధానాలను, వారి గురించి సమాచారాన్ని పుస్తకంలో పొందుపరిచిన సీతారామస్వామిని చిత్రకారులు అభినందించారు. అనంతరం పుస్తకంలో ప్రస్తావించిన 215 చిత్రకారులను కోనసీమ చిత్ర కళా పరిషత్ తరఫున సీతారామస్వామి ఘనంగా సత్కరించారు. చిత్ర బ్రహ్మోత్సవ లోగోను ఆవిష్కరించారు. తర్వాత జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment