పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
అమలాపురం టౌన్: జిల్లాలో శనివారం నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు డీఐఈఓ వనుము సోమశేఖరరావు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా శుక్రవారం పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ కమిషనర్ కృత్తికా శుక్లా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చేసిన సూచనలను జిల్లాలోని ప్రిన్సిపాల్స్‌కు వివరించారు. ఇంటర్ పరీక్షలు మొదటి దశగా శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ‘నైతికత–మానవ విలువలు’ అనే అంశంపై నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ తెలిపారు. రెండో దశగా ప్రాక్టికల్స్ పరీక్షలు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకూ మూడు స్పెల్స్‌లో జరుగుతాయని వివరించారు. జనరల్ ఇంటర్ బైపీసీ, ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకూ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు సెషన్స్‌లో ఉంటాయన్నారు. మూడో దశగా థియరీ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్ విద్యార్థులందరికీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరుగుతాయని సోమశేఖరరావు వివరించారు.
అల్ట్రా సౌండ్ స్కానింగ్
సెంటర్లపై నిఘా
అమలాపురం రూరల్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేయకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై గట్టి నిఘా పెట్టాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం చట్టం అమలుపై వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, లీగల్, సీ్త్ర శిశు సంక్షేమం, ఎన్జీఓలతో జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్ కిట్‌లు విక్రయించే మందుల షాపులపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమలాపురం డివిజన్‌లో 44, రామచంద్రపురం డివిజన్‌లో 26, కొత్తపేట డివిజన్‌లో 15 అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటిలో 13 ప్రభుత్వ స్కానింగ్ కేంద్రాలన్నారు. అన్ని స్కానింగ్ సెంటర్లలో పీసీ, పీఎన్డీటీ చట్టానికి సంబంధించిన బోర్డులు, వాల్ పోస్టర్లు, ధరల పట్టికను తప్పని సరిగా ప్రదర్శించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర, డీజీహెచ్ ఎస్.కార్తీక్, డీఐఓబీవీ సత్యనారాయణ, ఫ్యామిలీ డాక్టర్ ఎం.సుమలత, అదనపు డీఎంహెచ్‌ఓ హెచ్.భరత్‌లక్ష్మి, డాక్టర్ పీఎస్ శర్మ, సీఐ శ్రీనివాసరావు, సీడీపీఓ విజయ్‌శ్రీ తదితరులు పాల్గొన్నారు.
‘సత్రం డోనార్ స్కీం’కు
రూ.5,01,001 విరాళం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ‘సత్రం డోనార్ స్కీం’ కింద సికింద్రాబాద్‌కు చెందిన చేకొండ నరేష్‌బాబు, విజ య, రంజిత, వినిత కుటుంబ సభ్యులు రూ. 5,01,011 విరాళాన్ని ఈఓ వీర్ల సుబ్బారావుకు శుక్రవారం అందజేశారు. ఆ స్కీం కింద హరిహరసదన్ సత్రంలో ఒక గదిని కేటాయించాలని వారు కోరారు. దాతలకు ఆ సత్రంలో ఒక గదిని కేటాయించి ఈ స్కీం కింద లభించే అన్ని సదుపాయాలు అందజేయాలని ఈఓ ఆదేశించారు.
జీజీహెచ్‌లో శిశు ఆధార్
సేవలు ప్రారంభం
కాకినాడ క్రైం: జీజీహెచ్‌లో శుక్రవారం శిశు ఆధా ర్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి గైనిక్ వార్డులోని బర్త్ రిజిస్ట్రేషన్ విభాగంలో ఈ సేవల ను అందుబాటులోకి తెచ్చారు. సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ రాజకుమారి రిజిస్ట్రార్‌గా వ్యవహరించను న్న శిశు ఆధార్ సేవలు జీజీహెచ్ ఎంఆర్‌డీ సెక్షన్ ఆధ్వర్యంలో అందించనున్నారు. పుట్టిన శిశువు కు ఆధార్‌కార్డు మంజూరు చేయడమే ఈ సేవల లక్ష్యం. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెం డెంట్ లావణ్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment