ఫిషింగ్ హార్బర్‌లో బెల్ట్ షాపు
● ఎమార్మీ కంటే ఎక్కువకు మద్యం విక్రయాలు
● ప్రశ్నించిన వ్యక్తిపై దాడి
కాకినాడ రూరల్: వాకలపూడి గ్రామ పరిధిలోని ఒక మద్యం దుకాణ లైసెన్సుదారుడు మత్స్యకారులు అధికంగా ఉండే ఫిషింగ్ హార్బర్‌లో బెల్ట్ షాపు ద్వారా శుక్రవారం అమ్మకాలు ప్రారంభించాడు. ఎమ్మారీ కంటే రూ.10 అధికంగా విక్రయాలు చేపడుతున్నా ఎకై ్సజ్, సివిల్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. వాకలపూడి షిషింగ్ హార్బన్ ఎకై ్సజ్ నార్త్ స్టేషన్ పరిధిలోకి, పోలీసు పరంగా సర్పవరం స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ వేలంపాట ద్వారా బెల్ట్ షాపు కేటాయింపు చేస్తున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. స్థానికంగా వ్యతిరేకత రావడంతో కొన్ని రోజులు పాటు వేచి ఉండి శుక్రవారం బెల్ట్ షాపు ఏర్పాటు చేసి, అదనపు ధరకు విక్రయాలు ప్రారంభించారు. వాకలపూడిలో మొత్తం రెండు మద్యం షాపులు ఉండగా సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న మద్యం దుకాణ దారుడు ఫిషింగ్ హార్బర్‌లో బెల్ట్ షాపు ఏర్పాటు చేసినట్టు స్థానికంగా చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం హార్బర్ పేటలోని బెల్ట్ షాపులో జరుగుతున్న మద్యం విక్రయాలపై ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్త అప్పారావుపై మద్యం దుకాణదారుడి అండతో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అతడు వెంటనే ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. అనంతరం సర్పవరం స్టేషన్‌కు వెళితే ఫిర్యాదు తీసుకోలేదని బాధితుడు ఆరోపించాడు. కాగా.. హార్బర్‌పేటలో బెల్ట్ షాపు ఏర్పాటుపై ఎకై ్సజ్ నార్త్ స్టేషన్ సీఐ రామ్మోహన్ వివరణ కోరగా.. ఆ విషయం తమ దృష్టికి రాలేదని, తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment