హామీలు అమలు చేయలేకే అక్రమ అరెస్టులు
గోకవరం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని వైఎస్సార్ సీపీ జగ్గంపేట కోఆర్డినేటర్ తోట నరసింహం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట నియోజవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కాపరపు రమణను గతంలో ఎప్పుడో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే అభియోగంతో ఇప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ఈ విషయం వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇటువంటి తప్పుడు కేసులు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామన్నారు. నేను ఒక మాజీ మంత్రిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడుగా చెబుతున్నాను..ఇటువంటి తప్పుడు కేసులకు భయపడే పరిస్థితి లేదని ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించారు. గతంలో మేము ఇలాగే చేయాలనుకుంటే మీరు ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండేదికాదు. దానిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి తప్పుడు కేసులు బనాయించడం అనేది చాలా హేయమైన చర్య. జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని కార్యకర్తలందరూ సోషల్ మీడియా యాక్టివిస్టు రమణకు అండగా ఉంటామన్నారు. ఇప్పటికే పార్టీ ఎస్సీసెల్ కోఆర్డినేటర్ గుల్లా ఏడుకొండలు ఈ కేసుకు చెందిన న్యాయపరమైన చర్యలు తీసుకున్నారన్నారు. కాపరపు రమణ కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
కాపరపు రమణ అరెస్టు
హేయమైన చర్య
వైఎస్సార్ సీపీ జగ్గంపేట
కోఆర్డినేటర్ తోట నరసింహం
Comments
Please login to add a commentAdd a comment