సాక్షికి అభినందనలు
ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల పిల్లల్లో నూతన ఉత్సాహం కలుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ‘సాక్షి’కి ప్రత్యేక అభినందనలు. పిల్లలతో రోజుంతా ఆటలతో గడపడమే కాకుండా వారికి బహుమతులు, గిప్టులు ఇచ్చి వారికి ప్రోత్సాహం ఇచ్చినందుకు ధన్యవాదాలు. – కె.స్వప్నవర్మ, ఆశ్రమ నిర్వహకురాలు
ఆనందంగా ఉంది
ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. మాకు పండగలా ఉంది. చాలాకాలం తరువాత మేమందరం పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాం. చాచా నెహ్రుకి బాలలంటే ప్రత్యేక ఇష్టమని మా టీచర్ చెప్పారు. ఇప్పుడు మీ ద్వారా ఈ విధంగా ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. – యామిని లత, ఆశ్రమ విద్యార్థిని
బహుమతులు చాలా బాగున్నాయి
ఉదయం నుంచి ఆటల పోటీలతో ఉత్సాహ పరిచి, మాకు బహుమతులను అందచేసిన సాక్షికి కృతజ్ఞతలు. పుట్టిన రోజున మాత్రమే కేక్ కట్ చేస్తాం. ఈ రోజు మాతో కేక్ కట్ చేయించిన సాక్షి స్టాఫ్‌కి మరోసారి అభినందనలు. – లిఖిత, ఆశ్రమ విద్యార్థిని
(పిల్లల సైగలను స్పెషల్ ఎడ్యూకేట్ టీచర్స్ అనువాదం చేసి చెప్పారు)
Comments
Please login to add a commentAdd a comment