కెనరా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం
భీమవరం: కెనరా బ్యాంక్ 119 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం భీమవరం కెనరా బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బీఎస్ అనంత పద్మారావు మాట్లాడుతూ బ్యాంక్‌ను అభివృద్ధి చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా భీమవరం, రాజమహేంద్రవరంలో రక్తదాన శిబిరాల నిర్వహణతో పాటు తణుకులోని వృద్ధాశ్రమానికి రూ.50 వేల విలువైన సామగ్రి అందించామన్నారు. అనంతరం పలువురు ఖాతాదారులను సత్కరించారు.
జీఆర్టీ జ్యూయలర్స్
షోరూం ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ: జీఆర్టీ జ్యూయలర్స్ 61వ షోరూమ్‌ను బుధవారం రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్‌లో ప్రారంభించారు. జీఆర్టీ 60 ఏళ్లుగా నాణ్యత, విశ్వాసం, బలమైన ఉనికితో వ్యాపారాన్ని సాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన బంగారం, డైమండ్, ప్లాటినం, వెండి, జాతి రత్నాల ఆభరణాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.50 తగ్గింపు, బంగారు ఆభరణాల వేస్టేజీపై 20 శాతం తగ్గింపు, డైమండ్ విలువపై క్యారెట్‌కు రూ.10 వేల తగ్గింపుతో అందిస్తున్నామన్నారు. కస్టమర్లు వెండి వస్తువులు పట్టీల మేకింగ్ చార్జీలపై 25 శాతం తగ్గింపు, అన్కట్ డైమండ్ విలువపై 10 శాతం తగ్గింపు అందిస్తున్నామని జీఆర్టీ జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. కార్యక్రమంలో జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
యువకుడిని
గాయపరిచిన వ్యక్తిపై కేసు
కొత్తపల్లి: యువకుడిని గాయపరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బుధవారం స్థానిక పోలీసులు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే.. అమీనాబాద్ గ్రామానికి చెందిన యువకుడు గంట శ్రీను ఆదివారం రాత్రి టిఫిన్ తెచ్చేందుకు సెంటర్‌లోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి శ్రీనును ఆపి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వైఎస్సార్ సీపీ టీషర్స్ వేసుకుంటున్నావని, గతంలోనే హెచ్చరించినా బుద్ధి రాలేదా అంటూ అన్నాడు. దీంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. శ్రీనును రాజు తలపై గాయపరచగా, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై బాధితుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment