సుబ్బంపేటలో బాలిక మృతి
కొత్తపల్లి: వైద్యం వికటించి తమ కుమార్తె మృతి చెందినట్లు ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన మైలపల్లి మల్లేశ్వరి తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మైలపల్లి అక్షయ (16) తొమ్మిదో తరగతి చదువుతుంది. సోమవారం రాత్రి జ్వరంతో పాటు వాంతులు కావడంతో మంగళవారం ఉదయం ఉప్పాడలోని ఆర్‌ఎంపీ మామిడి సూరిబాబు వద్దకు తల్లి మల్లేశ్వరి తీసుకువెళ్లింది. అక్కడ ఆసుపత్రిలో అక్షయకు మూడు ఇంజక్షన్లు, సిలెన్‌లు, ఆక్సిజన్ పెట్టారు. తర్వాత మాత్రలు ఇచ్చి ఇంటికి తీసుకువెళ్లాని ఆర్‌ఎంపీ సూరిబాబు చెప్పారని బంధువులు అంటున్నారు. పాపకు బాగోలేదని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లండనే మాట చెప్పకుండా తీసుకువెళ్లమనడంతో ఇంటికి తీసుకొచ్చిన క్షణాల్లో అక్షయ స్పృహ కోల్పోవడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా ప్రాణాలు విడిచినట్లు మల్లేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై ఆర్‌ఎంపీ సూరిబాబును వివరణ కోరగా అక్షయ తన వద్దకు వచ్చేసరికే ఆరోగ్యం బాగోలేదని, ఆమెకు ఎటువంటి వైద్యం చేయలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లమని చెప్పానని అన్నారు. అయితే దీనిపై ఏవిధమైన సమాచారం లేదని ఎస్సై వెంకటేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment