ఎఫ్‌ఆర్‌ఎస్ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు
రాజమహేంద్రవరం రూరల్: పారదర్శక హాజరు పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ పేర్కొంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తీర్మానించింది. బుధవారం బొమ్మూరులోని ఏపీజీఈఏ కార్యాలయంలో అసోసియేషన్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎ.గిరిప్రసాద్‌వర్మ అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి సీహెచ్‌ఎస్ విల్సన్‌పాల్ మాట్లాడుతూ జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో బయోమెట్రిక్ ఎఫ్‌ఆర్‌ఎస్ పేరుతో జీతాలకు హాజరు ముడిపెట్టి కోత పెడుతున్నారన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో ఉన్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించకుండా జీతాలు కోత పెట్టడాన్ని వారు ఖండించారు. జిల్లా కోశాధికారి కాకర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబరు 14వ తేదీన జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు షరీఫ్, చాంబర్లీన్, దినేష్, రమేష్, కమల్‌సుందర్, డాక్టర్ శ్రీవల్లీ, పి.రవికుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment