నేడు స్వదేశానికి బాధిత మహిళ
గండేపల్లి: బతుకు తెరువు కోసం కువైట్‌కు వెళ్లి అక్కడ చిత్రహింసలకు గురైన మహిళ శుక్రవారం స్వదేశానికి రానుంది. ‘నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి!’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం వచ్చిన కథనానికి అధికారులు, ప్రభుత్వం స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. గండేపల్లి మండలం యల్లమిల్లిలో బాధితురాలి కుటుంబ సభ్యులను కలసిన అధికారులు వివరాలు తెలుసుకుని కువైట్‌కు పంపిన పాలకొల్లుకు చెందిన ఏజెంట్ ఎం.సుధాకర్‌తో మాట్లాడారు. ఏజెంట్ కూడా కువైట్‌లో ఉండటంతో బాధితురాలు గారా కుమారిని గురువారం కువైట్ నుంచి విమానం ఎక్కిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం ఉదయానికి ఆమె హైదరాబాద్ చేరుకోనున్నట్టు తెలిసింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు కనిపే సీత, అప్పారావు, పిల్లలు నాగమణి, సుబ్బలక్ష్మి, ఆనంద్ శామ్యూల్ సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment