ఇక భారీ వాహనాలకు బ్రేక్
కొవ్వూరు: రోడ్డు కం రైలు వంతెనపై భారీ వాహనాలకు బ్రేక్లు వేశారు. వీటి రాకపోకలను నియంత్రించేందుకు శాశ్వతంగా భారీ గడ్డర్లు ఏర్పాటు చేశారు. గతంలో కొవ్వూరు– రాజమహేంద్రవరం ప్రవేశ ద్వారం వద్ద ఆర్అండ్బీ అధికారులు గడ్డర్లు ఏర్పాటు చేయించారు. ఇవి భారీ వాహనాల రాకపోకలతో పలుమార్లు దెబ్బతిన్నాయి. వాటిని తిరిగి ఏర్పాటు చేయించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుటికే పలుమార్లు గడ్డర్లు దెబ్బతిన్న నేపథ్యంలో వంతెన ప్రవేశ ద్వారంలో శాశ్వతంగా భారీ వాహనాలు రాకుండా రైల్వే శాఖ అధికారులు గురువారం రెండు వైపులా శాశ్వత గడ్డర్లను ఏర్పాటు చేయిస్తున్నారు. క్రేన్ల సాయంతో వీటిని పెట్టారు. ఇటీవల కాలంలో వంతెన పైనుంచి భారీ వాహనాలు వెళ్తుండడంతో భద్రత దృష్ట్యా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
రోడ్డు కం రైలు వంతెనపై గడ్డర్ల ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment