● అలల ఉధృతి | - | Sakshi
Sakshi News home page

● అలల ఉధృతి

Published Thu, Nov 28 2024 12:15 AM | Last Updated on Thu, Nov 28 2024 12:15 AM

● అలల ఉధృతి

● అలల ఉధృతి

తొండంగి: హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. మండలంలోని అద్దరిపేట, కొత్తచోడిపల్లిపేట, వాకదారిపేట, పెరుమాళ్లపురం, దానవాయిపేట గ్రామాల్లోని తీరాల్లో కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో మత్స్యకారులు తమ బోట్లు తీరానికి చేర్చారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తుని మత్స్యశాఖ అభివృద్ది అధికారి సీహెచ్‌ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే వేటకు వెళ్లినవారంతా తీరానికి చేరుకోవాలని సమాచారం అందించామన్నారు. కాగా తుపాను ప్రభావంతో మెట్ట ప్రాంతాల్లో చలిగాలలు, ఈదురగాలుల వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గడంతో చలి తీవ్రతకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

దానవాయిపేట తీరంలో సముద్ర అలలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement