ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన సేవలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి, ప్రభుత్వ ఆసుపత్రి పట్ల మరింత గౌరవాన్ని పెంచే విధంగా వైద్యులు పనిచేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరు, భవన నిర్మాణాలు, సదరన్ సర్టిఫికెట్ల జారీ, తదితర 12 అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యసాధనలో వెనుకబడి ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాల శాతాన్ని పెంచాలన్నారు. డెలివరీ కేసులన్నీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే విధంగా ప్రజలకు నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని, సుఖ ప్రసవాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రి కి వచ్చే రోగుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సదరన్ సర్టిఫికెట్ల జారీలో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కింది సాయి సిబ్బంది నుంచి వైద్యాధికారి వరకు ఎఫ్ ఆర్‌ఎస్ అటెండెన్స్ కచ్చితంగా అమలు చేయాలన్నారు. హాస్పిటల్ అభివృద్ధి సంఘం నిధుల నుంచి హాస్పిటల్‌కు కావలసిన వైద్య పరికరాలు కొనుగోలు చేసుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు, గవర్నమెంట్ హాస్సిటల్ సూపరింటెండెంట్ సూర్యప్రభ, డీసీహెచ్‌ఎస్ అధికారి పద్మశ్రీరాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఎన్.వసుంధర పాల్గొన్నారు.
అన్ని డెలివరీలు ప్రభుత్వ
హాస్పిటల్‌లో జరగాలి
సుఖ ప్రసవాలకు మొదటి ప్రాధాన్యం
లక్ష్యసాధనలో వెనుకబడ్డ
పీహెచ్‌సీలకు షోకాజ్ నోటీసులు
కలెక్టర్ ప్రశాంతి
Comments
Please login to add a commentAdd a comment