కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన నిర్వహించ తలపెట్టిన మెగా పేరెంట్ మీటింగ్‌ను వాయిదా వెయ్యాలని జిల్లా యూటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయకర్, షరీఫ్ డీఈవో కె.వాసుదేవరావుకి అందచేశారు. డిసెంబర్ 7వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా గోదావరి జిల్లాల్లో పలు వేడుకలు జరుగుతాయని, అన్ని పాఠశాలల లోకల్ హాలీడే ఇస్తారన్నారు. ఒకవేళ పాఠశాలలు నిర్వహించినా విద్యార్థులు హాజరు చాలా తక్కువ ఉంటుందని, ఈ నేపథ్యంలో విద్యాశాఖ తలబెట్టిన విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశం సజావుగా జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. గోదావరి జిల్లాల్లో ఎన్నికల కోడ్ 10వ తేదీ వరకు ఉంటుందని, వీటన్నిటి దృష్ట్యా సమావేశం వాయిదా వేయవలసిందిగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment