రత్నగిరి.. భక్తఝురి
అన్నవరం : కార్తిక బహుళ ద్వాదశి, బుధవారం రత్నగిరి సత్యదేవుని సన్నిధి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం ప్రాంగణం భక్త జనసందోహంతో నిండిపోయింది. సుమారు 50 వేల మంది సత్యదేవుని దర్శించారు. సత్యదేవుని వ్రతాలు నాలుగు వేలు నిర్వహించారు. జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. సత్యదేవుని దర్శించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని ఊహించిన అధికారులు స్వామివారి ఆలయాన్ని బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు కూడా మూడు గంటల నుంచి ప్రారంభించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. స్వామివారి వ్రత మండపాలు, నిత్య కల్యాణ మండపం, పాత కల్యాణ మండపాలు వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ఎదురుగా గల రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు.
బుధవారం సత్యదేవుని
దర్శించిన 50 వేల మంది
నాలుగు వేల వ్రతాల నిర్వహణ
రూ.50 లక్షల ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment