ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు
గోకవరం: జిల్లాలో 18 మండలాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతోందని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ తాతారావు తెలిపారు. గోకవరంలో బుధవారం ప్రకృతి సేద్యంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో రసాయనాలు వాడకాన్ని నిషేధించడమే తమ లక్ష్యమన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తుల వల్ల ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను సాధించగలమన్నారు. సార్వా సమయాల్లో ప్రకృతి వ్యవసాయానికి రైతులు మొగ్గు చూపుతున్నారన్నారు. 2029 నాటికి తూర్పుగోదావరి జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా తాము చర్యలు చేపడుతున్నామన్నారు. ఎస్‌ఆర్‌పీ టి.లక్ష్మి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నేడు వర్గీకరణ
ఏకసభ్య కమిషన్ రాక
కాకినాడ సిటీ: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్‌మిశ్రా ఏక సభ్య కమిషన్ గురువారం కాకినాడ వస్తున్నందున ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు జిల్లా స్థాయి అధికారులతో కమిషన్ సమావేశం అవుతుందని, అనంతరం 11 నుంచి 2 రెండు గంటల వరకు కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో వివిధ ఎస్సీ ఉపకులాల వర్గాల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తుందన్నారు.
దాడులు అరికట్టాలి
అమలాపురం రూరల్: దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు అరికట్టాలని సీపీఎం 14వ జిల్లా మహాసభలలో రాష్ట నాయకులు డిమాండ్ చేశారు. అమలాపురం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన ముగింపు సభలో ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో లక్ష మందికి పైబడి కౌలు రైతులు ఉంటే కనీసం సగం మందికి కూడా కౌలు రైతుకార్డులు మంజూరు చేయలేదన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంగా మారాయన్నారు. తరచూ సంభవిస్తున్న తుపానుల కారణంగా ధాన్యంలో తేమశాతం పెరుగుతోందన్నారు. బస్తాను రూ.300 నుంచి రూ.400 నష్టానికి అమ్మాల్సిన స్థితి ఏర్పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment