ఆదిరెడ్డి కుటుంబం అవినీతి మయం
రాజమహేంద్రవరం సిటీ: ఆదిరెడ్డి కుటుంబం అవినీతి మయం అని, రాష్ట్రంలో అవినీతిలో మా ఈవీఎం ఎమ్మెల్యే శ్రీనివాస్ మొదటి స్థానంలో ఉంటాడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. ఎమ్మెల్యే దోపిడీ చేస్తూ, నా మీద గౌతమి సూపర్‌బజార్ కుంభకోణం అంటూ బురద జల్లుతున్నాడని భరత్ విమర్శించారు. బుధవారం రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోటిలింగాల ఘాట్ నుంచి 4వ బ్రిడ్జి వరకు 15 ర్యాంపులు పెట్టి రోజుకు 700 నుంచి 800 లారీలతో డ్రెడ్జింగ్ చేసి ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వాసు ఆదాయం రోజుకు రూ.24 లక్షలకు పైమాటేనన్నారు. పేకాట క్లబ్బులు నడుపుతున్నాడని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్‌ను వెంటబెట్టుకుని తిరుగుతూ, ఈవీఎం మహత్యంతో ఎమ్మెల్యే అయ్యాడన్నారు. భాస్కర్‌నగర్‌లో, లాలాచెరువు దగ్గర దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రూ.12 కోట్ల విలువైన ఆస్తిని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో హోమియో మందుల షాపు, లిక్కర్ షాపు, మెడికల్ షాపు పక్కపక్కనే ఉంటాయని, గుడి పక్కనే వైన్‌షాపును కూడా ఇక్కడే చూడొచ్చని ఎద్దేవా చేశారు. టీడీపీలో కుల దురంహకారం పెచ్చుమీరిందన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు హాజరైన మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషను తప్పు పడుతూ వారితో క్షమాపణలు చెప్పించడం ఎంతవరకు న్యాయమన్నారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో స్లాటర్ హౌస్‌లో రోజుకు 200 నుంచి 300 ఆవుల్ని నరికేస్తుంటే హిందూ ధర్మ పరిరక్షణ ఎక్కడికి వెళ్లిందో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తెలియజేయాలన్నారు. ఆ శ్లాటర్ హౌస్ నిర్వాహకుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడన్నారు. తమ కాలనీలో సమస్యపై ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించిన దళిత యువకుడిని రాజమహేంద్రవరం పోలీసు స్టేషన్‌లో అర్ధనగ్నంగా లాకప్‌లో కూర్చోబెట్టిన అంశంపై ఇప్పటికీ పోలీసులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
జగన్ పుట్టినరోజున క్రికెట్ టోర్నీ
ఈ నెల 21న మాజీ సీఎం వైఎస్ జగనన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మార్గాని ఎస్టేట్‌లో వైఎస్సార్ సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని భరత్ ప్రకటించారు. టోర్నీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
మాజీ ఎంపీ భరత్‌రామ్
Comments
Please login to add a commentAdd a comment