గుడ్డుతో
రోగనిరోధక శక్తి మెరుగు
గుడ్డు తీసుకోవడంతో ప్రతి ఒక్కరిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి ఇతర ఇబ్బందులు ఉండవు. ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం శీతాకాలంలో చాలామంది గుడ్డు వినియోగిస్తారు. ఈ కారణంగానే గుడ్డు ధర పెరిగి ఉండవచ్చు.
– డాక్టర్ కె.సుధాకర్,
వైద్యాధికారి, ధవళేశ్వరం పీహెచ్‌సీ
ధర బెంబేలెత్తిస్తోంది
ఇప్పటికే ఆయిల్ ధరలు మండుతుంటే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు ఎక్కువగా వినియోగించే కోడిగుడ్ల ధర ఆమాంతం పెరిగిపోయింది. కోడిగుడ్లు చిన్నసైజువి మాత్రమే వస్తున్నాయి. ఇలాగే ఉంటే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వహించడం భారంగా మారుతుంది.
– నాగల కృపావరప్రసాద్,
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, బొమ్మూరు
తగ్గుముఖం పడుతుంది
శీతాకాలంలో కోడిగుడ్డు వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కోల్‌కతా కోడిగుడ్డు మార్కెట్ తగ్గింది. దీంతో మన జిల్లాలో కోడిగుడ్డు ధర తగ్గే అవకాశం కనిపిస్తోంది.
– డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా డిప్యూటీ డైరెక్టర్,
పశుసంవర్ధకశాఖ, తూర్పుగోదావరి
Comments
Please login to add a commentAdd a comment