రెడ్ క్రాస్‌ను మరింత బలోపేతం చేద్దాం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రెడ్ క్రాస్ సేవలను మరింత బలోపేతం చేద్దామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కోసం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రాజమహేంద్రవరం కేంద్రంగా జిల్లా ఏర్పడిన తర్వాత సభ్యత్వ నమోదులో కొంత వెనుకబాటు ఉందన్నారు. జేఆర్‌సీ, వైఆర్‌సీ రెడ్ క్రాస్ సొసైటీలలో శాశ్వత సభ్యత్వం కోసం చిన్న మొత్తంలో రుసుము చెల్లించి సభ్యులుగా డిగ్రీ, ఇంటర్ కాలేజీలు, ఇంజినీరింగ్ కళాశాలలు సభ్యత్వం పొంది, జిల్లా యూనిట్‌ను బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసం వివిధ సంస్థలకు మండల స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించాలన్నారు. సమావేశంలో జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, జిల్లా ప్రణాళిక అధికారి ఎల్.అప్పల కొండ, రెడ్ క్రాస్ జిల్లా యూనిట్ ప్రతిపాదిత అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైస్ చైర్మన్ దాల్ సింగ్, ట్రెజరర్ సునీల్, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment