పుష్కరాలకు ప్రణాళిక
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి పుష్కరాల (2027) నిర్వహణకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రూ.1,587.80 కోట్లతో, కొవ్వూరు డివిజన్ పరిధిలో రూ.280.90 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ చెప్పారు. బుధవారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ పి. ప్రశాంతి, రుడా చైర్మన్, స్థానిక శాసనసభ్యులు, మునిసిపల్ కమిషనర్‌తో ఆయన నగర అభివృద్ధి, పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు. మరో 15 రోజుల్లో జిల్లాకి చెందిన అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 2014 పుష్కరాలకు రూ.2 వేల కోట్లతో నాలుగు మాసాల్లో అభివృద్ధ్ది పనులు చేశామన్నారు. ఇప్పుడు మూడు సంవత్సరాల ముందే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న జూన్, జూలై మాసాల్లో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు చేపడతామన్నారు. కలెక్టర్ ప్రశాంతి గోదావరి పుష్కరాలు, నగరంలో రహదారుల అభివృద్ధి, మురుగు నీరు, వ్యర్థాల నుంచి ఆదాయ వనరుల అంశాలపై వివరించగా, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మితలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతిపాదించిన పనులను వివరించారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పెట్రోల్ బంకు ప్రారంభం
స్థానిక క్వారీ సెంటర్‌లో రు.కోటి 96 లక్షలతో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును మంత్రి నారాయణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment