పురుగుల మందు తాగిన విద్యార్థిని మృతి
కొత్తపల్లి: తల్లి మందలించిందని కోపంతో పురుగుల మందు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. మండలంలోని రమణక్కపేట గ్రామానికి చెందిన చింతపల్లి నైపుణ్య(16) స్ధానిక జిల్లా పరిషత్ పాఠాశాలలో 10వ తరగతి చదువుతోంది. ఇటీవల పాఠాశాలలో నిర్వహించిన పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయని ఉపాధ్యాయులు బాలిక తల్లి సుభాషిణికి సమాచారం ఇచ్చారు. దీంతో ప్రతీ రోజు పాఠాశాలకు వెళుతున్నావు, బాగా చదువుకోవాలని తల్లి గట్టిగా మందలించడాన్ని తట్టుకోలేని వి ద్యార్థి గురువారం ఉదయం కూరగాయలకు కొట్టే పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్యానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీనిపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment