‘తల్లికి వందనం’ ఎప్పుడు?
ధవళేశ్వరం: తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ ప్రశ్నించారు. సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ధవళేశ్వరం జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సునీల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా ఇంకా తల్లికి వందనం నిధులు విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. పీజీ, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా రూ.3,580 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా ఇంజినీరింగ్ విద్యార్థులున్నారని, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని చెప్పారు. కలెక్టర్ ఆదేశాలను కూడా లెక్క చేయని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సత్వరమే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి, కలెక్టరేట్లను ముట్టడిస్తామని సునీల్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment