● ధాన్యపు కుచ్చులు ఫర్ సేల్!
రామచిలుకలు, పిచ్చుకలు ఇంటి హాల్లో పెట్టిన ధాన్యపు కుచ్చులలో ఉన్న గింజలను తింటూ ఉంటాయి. వీటిని ఎక్కువగా పల్లెల్లో చూస్తాం. ఇప్పుడు ఆ సంప్రదాయం పట్టణాలకు వ్యాప్తి చెందింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజానగరం మండలం సంపత్‌నగరం గ్రామానికి చెందిన రైతు యాళ్ల రుద్రం ధాన్యపు కుచ్చులను ప్రత్యేకంగా అల్లి బొమ్మూరు జంక్షన్‌లో 20 రోజులుగా విక్రయిస్తున్నారు. కుచ్చు సైజును బట్టి రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నాడు. ఈ ధాన్యపు కుచ్చులను చూసినవారు ఆసక్తిగా తిలకించడంతో పాటు కొనుగోలు చేసుకుని వెళుతున్నారు.
– రాజమహేంద్రవరం రూరల్
బొమ్మూరు జంక్షన్‌లో ధాన్యపు కుచ్చులను విక్రయిస్తున్న రైతు రుద్రం
Comments
Please login to add a commentAdd a comment