రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తుని: తుని–గుల్లిపాడు మధ్యలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి 40 ఏళ్ల వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. తెలుపురంగు కలిగి, 5.5 అడుగులు ఎత్తుతో తెలుపు రంగు బనియన్‌పై నలుపు రంగు చారలు కలిగిన నెక్ బనియన్, నలుపురంగు నైట్ ట్రాక్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియలేదన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
సీతానగరం: మండలంలోని మిర్తిపాడుకు చెందిన తానారి ప్రభాకరరావు (28) రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 8.30 గంటలకు మృతి చెందాడని హెడ్ కానిస్టేబుల్ రేలంగి శ్రీనివాసరావు తెలిపారు. మృతుడు ప్రభాకరరావుకు వివాహం కాలేదని, అప్పులు ఉండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో ఈ నెల ఒకటిన ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా, గమనించిన కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించాడు. తమ్ముడు దుర్గ ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు, ఆసుపత్రి సమాచారంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment