ఫైరింగ్ శిక్షణను పరిశీలించిన ఎస్పీ
పెద్దాపురం: పెద్దాపురం మెట్టపై పోలీసు సిబ్బందికి జరుగుతున్న వార్షిక ఫైరింగ్ శిక్షణను శుక్రవారం ఎస్పీ విక్రాంత్‌పాటిల్ పరిశీలించారు. అత్యాధునిక ఏకే–47, ఇన్సాస్, ఎల్‌ఎంజీ ఎస్‌ఎం–5 తదితర లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ ఆయుధాల పనితీరు, సామర్థ్యాన్ని ఆయన క్షుణంగా పరిశీలించి రేంజ్ పరిధిలోని సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు. ట్రైనీ ఏఎస్పీ సుష్మిత, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ శ్రీహరిరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
స్వయం ఉపాధి ద్వారా
ఆర్థిక స్వావలంబన
రాజోలు: స్వయం ఉపాధి పథకాల ద్వారా దళిత వర్గాలకు ఆర్థిక స్వాలంబన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. శుక్రవారం శివకోడులోని కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా షెడ్యూల్డ్ కులాల సహకార సంఘ కార్యనిర్వహక సంచాలకులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న ఎస్సీ ప్రణాళికలు, ఇ–ఆటోలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పౌల్ట్రీ కాంప్లెక్స్‌ల ద్వారా ఉపాధి కల్పించాలని సూచనలు జారీ చేశారు. కార్పొరేషన్ డైరెక్టర్లు వల్లూరి రాజా, ఎం.చంద్రశేఖర్, కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment