ఏపీ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అసోసియేషన్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ అధ్యక్షుడు ఆర్.వెంకటయ్య అధ్యక్షతన రాజమహేంద్రవరం బొమ్మూరులో ఆదివారం కార్యవర్గ సమావేశం జరిగింది. వెంకటయ్య, విశ్రాంత డీఈ ప్రసాదరెడ్డి ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. పూర్వపు 13 జిల్లాల నుంచి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా సాగి వెంకట సూర్యనారాయణరాజు (తూర్పు గోదావరి), ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎల్ సోమయాజులు (విజయవాడ), అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎం.నాగప్రసాద్ (నెల్లూరు), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎల్.కృష్ణ (విజయవాడ), ఫైనాన్స్ సెక్రటరీగా ఆర్‌వీ భానుప్రసాద్ (అనంతపురం) ఎన్నికయ్యారు. వీరితో పాటు ఐదుగురు వైస్ ప్రెసిడెంట్లను, ఐదుగురు జాయింట్ సెక్రటరీలను కూడా ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్) కుమార్‌తో పాటు సెంట్రల్ డిజైన్స్ కార్యాలయం ఎస్‌ఈ శివకుమార్‌రెడ్డి, హెడ్ వర్క్స్ ఈఈ కాశీవిశ్వేశ్వరరావు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని, సహేతుకమైన ఫిట్‌మెంట్, గౌరవప్రదమైన పీఆర్‌సీ–2023, ఇవ్వాలని, కారుణ్య నియామకాలను పునరుద్ధరించాలని, డిప్లొమా పొందేందుకు ఐటీఐ ఉద్యోగులకు ల్యాబ్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి హనుమాన్, కోశాధికారి ఎం.వెంకటరాజులు, 13 జిల్లాల నుంచి, 16 యూనిట్ల నుంచి రాష్ట్ర, జిల్లా ఆఫీసు బేరర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment